![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో... కృష్ణ ఉదయమే తులసికోటకి పూజ చేస్తుంది. మురారి ఎక్కడున్నాడో తెలిసిలే చేయమని తన కష్టాలు దూరమవ్వాలని వేడుకుంటుంది. మరోవైపు మీరా గురించి ఎంక్వైరీ చేయడానికి భవాని తనని తీసుకొచ్చిన ప్లేస్ కి వెళ్తుంది.
అక్కడే మురారి వొంటికి గాయాలతో కట్లతో ఉంటాడు. ఇక కొద్దిలో మురారిని భవాని చూస్తుందనగా.. ముకుంద అక్కడే మురారికి కాపాలగా ఉంచిన ఒకావిడ మేడమ్ అని పిలుస్తుంది. మీరా లేదా అని భవాని ఆవిడని అడుగగా.. లేదని, ఎవరో గొప్పింటి వాళ్ళు తీసుకెళ్ళారని, తను అనాథ అని, అందరితో ఇట్టే కలిసిపోయేదని భవానీతో మీరా గురించి మంచిగా చెప్తుంది. ఇక భవాని అది నమ్మేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మురారి దగ్గరికి మీరా వస్తుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడి ఉంటే నేనే కాపాడి తీసుకొచ్చాను లేదంటే ప్రాణాలతో ఉండేవాడివా అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావ్. నన్ను నా ప్రేమని అర్థం చేసుకుని ఉంటే ఎప్పుడో కృష్ణని వదిలేసి నాకోసం వచ్చేవాడివి అనేసరికి మురారి ఆవేశంగా.. ముకుంద అంటాడు. సరోగసి నిజంగానే జరిగింది కదా. కృష్ణకి కడుపు వచ్చింది అబద్ధం చెప్పావు కదా అలాగే ఇంకొక అబద్ధం చెప్పు. ముకుంద నా వల్లే తల్లి అయ్యింది అది నీకు చెప్తే తట్టుకోలేవని సరోగసి అని చిన్న నాటకం ఆడానని చెప్పు కావాలంటే డాక్టర్ వైదేహితో చెప్పిస్తాను. ఇలా చెప్తే కృష్ణ నిన్ను అసహ్యించుకుని వెళ్లిపోతుందని అంటుంది. నీ బొందలాగా ఉంది ఐడియా నేను కదల్లేక వదిలిపెడుతున్నా లేదంటే అని మురారి కోపంగా అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకంటే నీ బిడ్డ నా కడుపులో ఉంది కదా. నేను చెప్పినట్టు వింటే అందరం సేఫ్ గా ఉంటాం. లేదంటే కృష్ణ కూడా ఉండదు. నా కడుపులో నీ బిడ్డ కూడా ఉండదని వార్నింగ్ ఇస్తుంది.
అప్పుడే భవాని ఇంటికి రాగా.. రేవతి, మధు వాళ్ళ అమ్మ, మధు తన దగ్గరికి వస్తారు. ఎక్కడికెళ్ళారని రేవతి అడుగగా.. మీరా ఎలాంటిదో తెలుసుకుందామని వెళ్ళానని భవాని అంటుంది. మీరా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముందని మధు అడుగుతాడు. కృష్ణని నమ్మకుండా తన గురించి ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదని అంటాడు. మీరా తల్లి అయ్యింది.. కారణం ఎవరంటే మురారి అంటుంది. వాడిని అడుగుదామంటే ఆ క్షణం నుంచి మురారి ఏమైపోయాడో తెలియడం లేదని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |